తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అడుగు పెట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అందుకున్నాడు. అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. సినిమాల నుంచి సామాజిక అంశాల వరకు అతను తీసుకునే నిర్ణయాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి.

పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే అతడి మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ అనే సినిమా అని అందరికీ తెలిసిందే.అయితే అతడు ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అరవింద్ ఈ సినిమాను ఒక మీడియం రేంజ్ లో హీరోకు తగ్గట్లు తీశారు.
బడ్జెట్ కూడా చాలా తక్కువ అయింది. అప్పడు పవన్ కు నెలకు రూ.5వేలు ఇచ్చారట. షూటింగ్ పూర్తయ్యే వరకు పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు మొత్తం పారితోషకం రూ.50 వేల వరకు వచ్చిందట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ అదే ఫిగర్ కానీ వేలల్లో కాదు కోట్లల్లో. అవును ప్రస్తుతం పవన్ రూ.50 కోట్లు తీసుకుంటున్నాడు.
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ను సినిమా పరిశ్రమకు పరిచయం చెయ్యడానికి చాలా సినిమా కథలు పరిశీలించి చివరగా బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ఖయామత్ సే ఖయామత్ తక్ అనే చిత్రాన్ని రీమేక్ చెయ్యడానికి నిశ్చయించుకొని ఆ సినిమా నిర్మాణ బాధ్యతలను అల్లు అరవింద్ కు ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే పేరుతొ ఈ.వి .వి.సత్యనారాయణ తెరకెక్కించిన విషయం తెలిసిందే.































