Suma Kanakala: సుమ కనకాల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ప్రతి ఒక్కరికీ ఎంతో సుపరిచితమైన సుమ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమా ఈవెంట్లు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉండే సుమ ఒక రోజుకు లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

ఇలా పలు సినిమా ఈవెంట్స్ ద్వారా బుల్లి తెర పై ఎంతో బిజీగా ఉండే సుమ ఇక పై వెండితెర పై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. సుమ ఇదివరకే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినప్పటికీ ప్రస్తుతం బుల్లితెర యాంకర్ గా ఎంతో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి వెండితెర ఎంట్రీ ఇచ్చారు.

విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వంలో సుమ లీడ్ రోల్ పోషిస్తున్న జయమ్మ పంచాయతీ అనే చిత్రాన్ని బలగ ప్రకాశ్ నిర్మించారు. ఈ సినిమాకు గానూ సుమ ఓ రేంజ్లో పారితోషకం తీసుకున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏమాత్రం వెనకడుగు వేయని నిర్మాతలు….
ఒకరోజు కాల్షీట్స్ ఇస్తే సుమారు లక్ష రూపాయల వరకు ఛార్జ్ చేసే సుమ జయమ్మ పంచాయతీ సినిమా కోసం ఏకంగా 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.సుమ ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడంతో ఆమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు సైతం అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదని తెలుస్తోంది. బుల్లి తెరపై తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుమ వెండితెరపై జయమ్మగా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.






























