Ram Charan -NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే. వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే వ్యక్తిగతంగా వీరిద్దరికీ ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి,వీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా సెలబ్రిటీలు ఖరీదైన కార్లు, బంగ్లాలు కొనుగోలు చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఎంతో ఖరీదైన కార్లు ఉంటాయి. ఎన్టీఆర్ గ్యారేజ్ లో లంబోర్గిని యూరుస్ గ్రాఫైట్ ఖరీదైన కారు ఉంది. ఈ కారు ధర సుమారు 3. 16 కోట్లు అని తెలుస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని కోట్ల విలువ చేసే కార్లు ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్నాయి.

రామ్ చరణ్ కార్ల విషయానికి వస్తే ఆస్టన్ మార్టిన్ వన్ టేజ్ కారు ఉంది. ఈ కారును రామ్ చరణ్ కు తన తండ్రి కానుకగా ఇచ్చారు. ఈ కారుతో పాటు మెర్సిడెస్ బెంజ్, జి ఎల్ ఎస్ 350 డి లాంటి కార్లు ఉన్నాయి. వీటి ధర 80 లక్షల రూపాయలు ఉండొచ్చని అంచనా. ఇక ఎన్టీఆర్ కు80 కోట్లు విలువ చేసే ప్రవేట్ జెట్ ఉండగా, రామ్ చరణ్ కు ట్రూ జెట్ అనే ఎయిర్ లైన్ సమస్థ ఉంది.
వందల కోట్లలో ఆస్తులు..
ఇక వీరిద్దరూ హైదరాబాద్లో ఎంతో ఖరీదైన విలాసవంతమైన బంగ్లాలను కొనుగోలు చేశారు. హైదరాబాదులో పాటు బెంగళూరు వంటి నగరాలలో కూడా ఖరీదైన ఇల్లు ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు 440 కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ 1300 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే వీరిద్దరూ కలిసి నటించిన RRR సినిమాకు 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది






























