Balakrishna First Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య డైలాగులు చెప్పారంటే థియేటర్ మొత్తం దద్దరిల్లి పోవాల్సిందే.మాస్ యాక్షన్ చిత్రాలతో బాలకృష్ణ దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.

బాల నటుడిగా పలు సినిమాలలో చేసిన ఈయన తన తండ్రి నందమూరి తారకరామారావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మకల అనే చిత్రంలో మొదటిసారిగా నటించారు. బాలకృష్ణకు నటనపై ఉన్న ఆసక్తితో రామారావు ప్రత్యేకంగా కథను సిద్ధం చేసి తన దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించి 1974, ఆగస్టు 30న విడుదల చేశారు.

ఈ సినిమా కుటుంబ నియంత్రణ ప్రచారానికి వ్యతిరేకంగా తెరకెక్కించారని ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయితే ఈ సినిమా అప్పటికే విడుదలై 50 రోజులు కావడంతో ఈ సినిమా గురించి అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సినిమా ప్రసారాన్ని ఆపివేశారు. ఇక నందమూరి తారక రామా రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఈ సినిమాలో తాము కుటుంబ నియంత్రణ ప్రచారానికి, భూసంస్కరణలకు వ్యతిరేకంగా ఈ సినిమా తీయలేదు. అంతా కష్టపడి పనిచేస్తే అలాంటి సంస్కరణలతో పనిలేదని చెప్పే ప్రయత్నం చేశాను అంటూ లేఖ రాశారు.

రెండుసార్లు విడుదలైన మొట్టమొదటి చిత్రం…
ఎన్టీఆర్ రాసిన లేఖను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం సినిమాని చూసి అనంతరం ఈ సినిమాకు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఈ సినిమాని తిరిగి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కథలో కొన్ని స్వల్ప మార్పులు చేసి మొదట ఈ సినిమాను విడుదల చేయగా తరువాత 1975, జనవరి 8న ఈ చిత్రం రెండవసారి కలర్ లో విడుదల చేశారు. టాలీవుడ్ చరిత్రలోనే ఇలా ఓకే సినిమా రెండు సార్లు విడుదలవుతూ ఈ సినిమా చరిత్ర సృష్టించిందనీ చెప్పాలి.



























