Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ మునుపెన్నడూ లేని విధంగా గా ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. 2021 బాలకృష్ణకు అచ్చొచ్చిన ఏడాదిగా చెప్పవచ్చు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ లో వరుసగా హ్యాట్రిక్ హిట్ నమోదైంది. బాలకృష్ణ కెరీర్ లోనే రికార్డ్ కలెక్షన్లను సాధించింది అఖండ. రూ. 100 కోట్ల క్లబ్ లో నిలిచిన బాలకృష్ణ తొలి మూవీగా రికార్డులకెక్కింది.
మరోవైపు ఓటిటి లో కూడా బాలయ్య సత్తా చాటుతున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సూపర్ హిట్ అయింది.

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలో బెస్ట్ టాప్ 10 షోల్లో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా కనిపిస్తోంది.
చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు…
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా బాలకృష్ణ మరో సినిమాకు కమిట్ అయ్యారు. తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఇందులో ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు బాలకృష్ణ. తన ఇంట్లో ఉండే వంట వాడు చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. అతన్ని ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటానని బాలయ్య అన్నాడు. నాకు ఎన్నో వ్యాపకాలు ఉన్నా.. వంటలను కూడా గుర్తుంచుకోవాలని బాలయ్య కామెంట్ చేశాడు. ఏ వారం ఏం తినాలి అనేది ఒక లెక్క ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత బాలయ్య వంటవాడికి ఫోన్ చేసి దొండకాయ, క్యాలీఫ్లవర్, బంగాళదుంప చేయాలని.. వెల్లుల్లి జీలకర్ర దంచి వేయాలని చెప్పుకొచ్చాడు. ఇంటి భోజనం ఆరోగ్యకరమైనది అంటూ.. మంగళవారం రోజున ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్స్ గురించి బాలయ్య కామెంట్ చేశారు.































