బిగ్ బాస్ హౌస్ లోకి 19మంది కంటెస్టెంట్ లలో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లోబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లోబో ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు. మొదటి రెండు వారాలు కంటెస్టెంట్ ఉమాదేవితో ఎంతో చనువుగా ఉంటూ ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ అందించారు. ఇక ఉమాదేవి ఎలిమినేషన్ తర్వాత లోబో, రవి ఇద్దరూ కలిసి గేమ్ ఆడేవారు.

ఇలా ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న లోబో ఒక వారం పాటు సీక్రెట్ రూమ్ లో ఉన్నారు. ఇలా హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ అందించారు. ఇక 8వ వారం నామినేషన్ లో ఉన్న లోబో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఎనిమిది వారాలకు గానీ బిగ్ బాస్ లోబోకు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించి ఉంటారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ముందుగా బిగ్ బాస్ లోబోతో కుదుర్చుకున్న డీల్ ప్రకారం అతనికి రోజుకు పాతిక వేలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే లోబో వారానికి లక్షన్నర నుంచి రెండులక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ ప్రకారం చూస్తే ఎనిమిది వారాలకు గానీ లోబో 15 నుంచి 20 లక్షల మధ్య రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.
ఇక బిగ్ బాస్ ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం మాత్రమే కాకుండా, బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులకు లోబో అందించిన కంటెంట్ ను దృష్టిలో ఉంచుకొని అతనికి మరింత ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు ఏది ఏమైనా బిగ్ బాస్ ద్వారా లోబో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
































