స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడు ప్రతీ సినిమాకు డిఫరెంట్ స్టైల్ తో ఓ కొత్త లుక్ తో కనిపిస్తాడు. ఏ రెండు సినిమాల్లోనూ అల్లు అర్జున్ ఒక్కలా కన్పించడంటే అతిశయోక్తి కానేకాదు. బహుశా అందుకే అతన్ని స్టైలిష్ స్టార్ గా పిలుస్తుంటారు.

దక్షిణాదిన సరే కానీ.. ఉత్తరాదిన అల్లు అర్జున్ కు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కూడా అందుకే. ఇక అతడి నటనతో ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా.. యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. మొదట చివరంజీవి హీరోగా నటించిన సినిమాలో డ్యాన్స్ వేస్తూ కనిపించిన బన్నీ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బన్నీకి ఆ రోజు నుంచే డ్యాన్స్ లో మంచి గ్రిప్ ఉందనే టాక్ వినిపించింది.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంత పారితోషికం తీసుకున్నారనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. దర్శకుడు రాఘవేంద్రరావు అతడికి రూ. 100 పారితోషికం ఇచ్చారట. ఇక తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే 100 వ చిత్రం గంగోత్రిలో హీరోగా బన్నీ పరిచయం అయ్యాడు. తర్వాత ఆర్య సినిమాతో తన స్టైల్ మార్చేసి.. యువతకు బాగా దగ్గర అయ్యాడు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్యతోనే అతడు స్టైలిష్ స్టార్ గా పేరుతెచ్చున్నాడు. తర్వాత బన్నీ, దేశముదురు, ఆర్యా 2, పరుగు వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలోనే బన్నీ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. పుష్ప సినిమాతో మరొకసారి థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.

































