Actress Anjali: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి ఈమె అసలు పేరు బాలాత్రిపురసుందరి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును అంజలిగా మార్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

షాపింగ్ మాల్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలివంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా తెలుగు తమిళ చిత్రాలలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి అగ్రహీరోల సరసన నటించిన అంజలికి పెద్దగా సరైన హిట్ రాలేదని చెప్పాలి. ఇకపోతే అంజలి దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ ఈమె సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చరణ్ సినిమాతో బిజీ..
ఈ విధంగా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈమె పదికోట్ల ఆస్తిపాస్తులను సంపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో ఈమె కష్టపడి సంపాదించి కూడబెట్టిన ఆస్తుల విషయమై తన కుటుంబ సభ్యులతో గొడవ పడిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం అంజలికి చెన్నైతో పాటు హైదరాబాద్ లో కూడా పది కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిపాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నారు.































