Vijay Devarakonda: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం హీరోగా ఎంతో మంచిది సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన హీరోగా ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన విజయ్ దేవరకొండ అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తన సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన తమ్ముడు ఆనంద దేవరకొండ సైతం హీరోగా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి మల్టీస్టారర్ సినిమా కూడా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు.
సరైన కథ దొరికితే తప్పకుండా మల్టీస్టారర్ సినిమా చేస్తామని గతంలో దేవరకొండ బ్రదర్స్ వెల్లడించారు. ఇకపోతే ఈయన తన తమ్ముడితో ఇప్పటివరకు కలిసి సినిమా చేయకపోయినా తన తల్లితో కలిసి ఒక సినిమాలో నటించారని తెలుస్తోంది. బహుశా ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఈయన తన తల్లితో కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించారు.
విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి మాధవి దేవరకొండ కూడా నటించారు. అయితే ఈమె ఈ సినిమాలో ఎక్కువసేపు స్క్రీన్ పై కనిపించకపోవడంతో చాలామంది అక్కడ విజయ్ దేవరకొండ తల్లి అని గుర్తించి ఉండకపోవచ్చు. డియర్ కామ్రేడ్ సినిమాలో మాధవి దేవరకొండ లెక్చరర్ గా ఒక అతిథి పాత్రలో కనిపించి సందడి చేశారు. ఇలా తల్లితో కలిసి విజయ్ దేవరకొండ స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక చిత్రం డియర్ కామ్రేడ్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
































