బిగ్ బాస్ రియాల్టీషో లో వీక్ ఎండ్ లో హౌస్ మేట్స్ తో నాగార్జున వచ్చి చేసే హంగామా మామూలుగా ఉండదు. మూడో సీజన్ నుంచి ప్రస్తుతం అం అం రన్ అవుతోన్న ఐదో సీజన్ వరకు నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శనివారం, ఆదివారం ఇంటి సభ్యులతో నాగార్జున ముచ్చటించే సమయంలో అతడు ధరించే షర్ట్ లు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.

అయితే కొన్ని సందర్భాల్లో నాగార్జున స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో గ్లామర్ గా కనపడుతుంటాడు. మొదటి సీజన్ కు ఎన్టీఆర్, రెండో సీజన్ కు నానీ హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాళ్ల డ్రస్సింగ్ స్టైల్ మాత్రం కోటులో వచ్చి అలరించేవారు. నాగార్జున మాత్రం దానికి భిన్నంగా షర్ట్ వేసుకొని వస్తుంటాడు. అయితే గత వారం నాగార్జున ధరించిన షర్ట్ ఖరీదు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దాని ధర ఎంత ఉంటుందనే దానిపై నెటిజన్లు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. దాని ధర అక్షరాల రూ.82,211 అంట. ఆ ధర తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున ఇటు బిగ్ బాస్ హౌస్ హోస్ట్ చేసుకుంటూ.. అటు సినిమా షూటింగ్ లో కూడా బిజీ అయ్యారు. ప్రస్తుతం బంగార్రాజు, ది ఘోస్ట్ సినిమాల్లో నాగార్జున నటిస్తున్నాడు.
బంగార్రాజు చిత్రం నుంచి ఓ పాటను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో నాగార్జున సింగర్ అవతారమెత్తాడు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా కనిపించబోతున్నాడు. కుటుంబ కథా నేపథ్యంలో రూపొందించే ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.































