Cini Celebrities: సాధారణంగా చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు పెట్టిన పేర్లతోనే మనల్ని పిలవబడతారు. అయితే కొందరు కొన్ని కారణాల వల్ల ఇతర పేర్లతో పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొంది ఉంటారు.అలాగే మరి కొందరు వారి జాతక దోషాలు ప్రకారం మధ్యలో పేర్లను మార్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు వారి అసలైన పేర్లతో కాకుండా ఇతర పేర్లతో ఎంతో గుర్తింపు పొందిన వారు ఉన్నారు.మరి అలాంటి సెలబ్రిటీలు ఎవరు వారి అసలు పేర్లు ప్రస్తుత పేరు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ ఆయన పేరులో శివాజీ గణేషన్ లా శివాజీ ఉందని ఎంతో సంతోషపడ్డారు.అయితే డైరెక్టర్ బాలచందర్ నీకు రజనీకాంత్ అనే పేరు ఎందుకు బాగా కలిసి వస్తుంది అనుకుంటున్నాను ఇప్పటినుంచి ఈ పేరుతోనే పిలుస్తాను అంటూ అతని పేరును రజనీకాంత్ గా మార్చారు. ప్రముఖ డ్యాన్సర్ జయమాలిని అసలు పేరు అలిమేలు. దర్శకుడు రామ్ అన్న నువ్వు గొప్ప డాన్సర్ కావాలి అంటూ ప్రముఖ డాన్సర్ హేమమాలిని పేరులో మాలిని తీసుకొని తనకు జయమాలినీ అని పెట్టారు.

జయంతి అసలు పేరు కమల కుమారి. అయితే తనకు సినిమా అవకాశాలు రాకపోవడంతో తన పేరును జయంతిగా మార్చుకున్నారు. ముత్యాలముగ్గు సినిమాలో నటించినప్పుడు నూతన్ ప్రసాద్ పేరు వరప్రసాద్. అయితే ఆయన ఎక్కువగా మద్యానికి బానిస అయ్యి అనారోగ్యం పూర్తిగా పాడైంది. చివరికి అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ప్రస్తుతం తాను కొత్త వరప్రసాద్ అని చెబుతూ.. తన పేరును నూతన్ ప్రసాద్ గా మార్చుకున్నారు.
అసలు పేర్లు కాకుండా కొత్త పేర్లతో గుర్తింపు…

అలనాటి హీరోయిన్ కవిత అసలు పేరు కృష్ణ కుమారి. అయితే అప్పటికే ఇండస్ట్రీలో కృష్ణకుమారి అనే హీరోయిన్ ఉండడంతో దర్శకుడు శ్రీధర్ ఆమె పేరును కవిత అని మార్చారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో శివశంకర వరప్రసాద్ గా ఉన్నటువంటి ఈయన చిరంజీవిగా మారిపోయారు. భక్తవత్సలం నాయుడు మోహన్ బాబుగా మారిపోయారు. భూపతిరాజు రవిశంకర్ రాజు రవితేజగా పేరు మార్చుకున్నారు. ఇలా ఎంతో మంది ఇండస్ట్రీలో అసలు పేర్లతో కాకుండా కొత్త పేర్లతో చలామణి అవుతూ మంచి గుర్తింపు పొందారు.