ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన భారీ చిత్రం పుష్ప. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కింది ఈసినిమా. ఇప్పటికే థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే భారీ కాస్ట్ అండ్ క్రూతో మొదలైన సినిమా అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లో మారుమోగింది.

దీనికి అనుగుణంగానే చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు, విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్, రష్మికా మందన్నా, సునీల్ వంటి నటులతో పాటు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాపై అంచానాలు పెంచింది. అయితే ఇప్పుడు పుష్ప సినిమాకు ఎవరు ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాకు బన్నీ దాదాపుగా రూ. 40 కోట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా లాభాల్లో వాటాా తీసుకుందాం అనుకున్నప్పటికీ చివరికు పారితోషకంగా తీసుకున్నారు. బన్నీతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా దాదాపు రూ. 25 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు సమాచారం. విలన్ పాత్రలో చేసిన ఫహాద్ ఫాజిల్ 3.5 కోట్లు, హీరోయిన్ రష్మికా మందన్న రూ. 8-10 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ రూ.3.5 కోట్లు, స్పెషల్ ఐటెం సాంగ్ చేసిన సమంత రూ. 1.5-2 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మరో ముఖ్యమైన పాత్రలో చేసిన అనసూయ భరద్వాజ్ రూ. 1.5-2 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రెమ్యునరేషన్ విషయం సిని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.






























