Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన పార్టీ పెట్టిన 15 సంవత్సరాలకు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ త్వరలోనే ఏపీ క్యాబినెట్లో కీలక పదవులు కూడా అందుకు పోతున్నారు.

గత ఎన్నికలలో పొత్తు లేకుండా గెలిచిన ఈయన ఘోరంగా ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే ఇటీవల పవన్ కళ్యాణ్ తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో జీతం తీసుకుని అందుకు 1000 రెట్లు ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.
ఈ క్రమంలోనే ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఎంత మొత్తంలో జీతం అందుకోబోతున్నారు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో ఎమ్మెల్యే నెలకు 3.35 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక నియోజకవర్గ అలవెన్స్ లతో పాటు ఇతర అలవెన్స్ లన్నీ కలిపి ఈ స్థాయిలో జీతం అందుకోబోతున్నారు.
3.35 లక్షల జీతం..
ఇక పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు లక్షల జీతం రాగా ఆంధ్రలో మాత్రం ఎమ్మెల్యేలు 3.35 లక్షల రూపాయల జీతం అందుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా మంత్రి పదవి కూడా అందుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఈయన ఏ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారో తెలియాల్సి ఉంది.





























