Pawan kalyan: తెలుగు సినీ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ క్రేజ్ ఉందో మనందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. పవన్ కళ్యాణ్ ఒక వైపు హీరోగా సినిమాలు తీస్తూనే మరొకవైపు జనసేన పార్టీ అధినేతగా పార్టీ ప్రచారాల లో చురుకుగా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయక్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రెండు మూడు సినిమాలలో నటిస్తూ ఉన్నారు పవన్.

ఆ సినిమాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే జనసేన తొమ్మిదవ ఆవిర్భావ సభకు లక్షలాదిగా అభిమానులు, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఆ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం సమయంలో వేలికి ధరించి ఉన్న ఉంగరం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ చేతికి పగడపు ఉంగరం ధరించాడని, మామూలుగా ఇలాంటి ఉంగరాలను జాతకంలో దోషాలు తొలగి పోవాలి అన్న ఉద్దేశంతో దరిస్తారు అని చెబుతూ ఉంటారు.

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి దైవభక్తి కూడా ఎక్కువే అన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటాడు. అలాంటి పవన్ కుడిచేతికి అలాంటి పగడపు ఉంగరం ధరించి కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఉంగరానికి సంబంధించి కొన్ని కథనాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కొంతమంది అయితే పగడపు ఉంగరాన్ని దర్శకుడు త్రివిక్రమ్ సూచన మేరకే ధరించి ఉంటాడు అని కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అతి సన్నిహితుడు గా భావించే పవన్ కళ్యాణ్ స్నేహితుడు మాటను గౌరవించి ఆ ఉంగరాన్ని ధరించినట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
జీవితాన్ని మారుస్తుందా….
మరి నాలుగు క్యారెట్స్ బరువున్న ఈ ఉంగరం పవన్ కళ్యాణ్ కు కెరీర్ పరంగా, రాజకీయపరంగా మంచి చేస్తుందా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా అధికారంలోకి తీసుకు వస్తుందా అని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఆ ఉంగరం ధరించడం పై పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి అందరూ అనుకున్న విధంగా పవన్ దరించిన ఆ పగడపు ఉంగరం పవన్ కళ్యాణ్ జీవితాన్ని మార్చే పోతుందా? లేదా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాడు పవన్ కళ్యాణ్.
































