khansar City: డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలాడ్ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి ఇద్దరూ ఎలా శత్రువులుగా మారారు అన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించిన ఇందులో పృధ్విరాజ్ సుకుమారన్ తో పాటు జగపతిబాబు వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా కేజిఎఫ్ సినిమాకు పోలికలు ఉన్నాయి అంటూ గతంలో వార్తలు రాగా ఈ వార్తలు పై ప్రశాంత్ స్పందిస్తూ ఈ రెండు సినిమాలకు ఏమాత్రం పోలిక లేదని తెలిపారు. అయితే ఆయన చెప్పినట్టుగానే ఎక్కడ కూడా కే జి ఎఫ్ సినిమాకు పోలికలు లేవని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కథ మొత్తం ఖాన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది మరి ఈ సినిమాలో చూపించినటువంటి ఈ నగరం నిజంగానే ఉందా అన్న సందేహాలు అందరికీ కలుగుతున్నాయి ఈ నగరం సినిమాలో గుజరాత్ పాకిస్తాన్ మధ్య ఉన్నట్టు చూపించారు కానీ నిజంగానే ఈ నగరం ఉన్నప్పటికీ గుజరాత్ పాకిస్తాన్ మధ్య లేదని ఈ నగరం ఇరాన్ దేశంలో ఉందని తెలుస్తుంది.
ఇరాన్ దేశంలో…
ఖాన్సార్ కౌంటీ అనే నగరం. ఇరాన్ లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో ఉంది. ఇక్కడ 22 వేలకు పైనే పర్షియన్స్ నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చూపించిన నగరానికి నిజమైనటువంటి సిటీకి ఏమాత్రం పోలికలు లేవు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది బాహుబలి తర్వాత ప్రభాస్ అందుకున్నటువంటి హిట్ సినిమాలలో సలార్ సినిమా ఒకటని చెప్పాలి.






























