Nagarjuna -Amala: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున సినీ కెరీయర్ ఎంతో అద్భుతంగా కొనసాగుతోంది. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ముందుగా దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకుని అనంతరం తనకు విడాకులు ఇచ్చారు.

ఈ క్రమంలోనే నాగార్జున నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ముందుగా ఎవరు ఎవరికి ప్రపోస్ చేశారనే విషయం గురించి ఇప్పటి వరకు క్లారిటీ లేదు.ఈ విషయంలో క్లారిటీ తెలుసుకోవాలనుకున్న నాగార్జునను ఈ ప్రశ్న అడిగే ధైర్యం ఎవరికీ లేదనే చెప్పాలి.

ఇన్ని రోజులు ఈ విషయం గురించి ఎవరికీ తెలియక పోయినప్పటికీ తాజాగా అమల బ్రదర్ సురేష్ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వీరి ప్రేమ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తాను అమలకు సొంత తమ్ముడు కాకపోయినా తనని తోబుట్టువుగానే చూసుకున్నారని తెలిపారు. ఇలా మేమిద్దరం ఎంతో స్నేహంగా దగ్గరగా ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించుకోలేదని తెలిపారు.
అమలకు ప్రపోజ్ చేసిన నాగ్…
అందరిలాగే నాగార్జున అమల మద్య ఏదో ఉందని వచ్చిన వార్తల వరకే తనకు కూడా తెలుసని, అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ముందుగా నాగార్జున తన ప్రేమ గురించి అమల దగ్గర బయట పెట్టారని సురేష్ చక్రవర్తి వెల్లడించారు. ఈ విషయాలను సురేష్ చక్రవర్తి బయట పెడుతూనే సారీ నాగ్ తప్పు ఉంటే క్షమించు అంటూ తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ముందుగా నాగార్జున అమలకు ప్రపోజ్ చేశారని తెలుస్తోంది.



























