సీనియర్ హీరోయిన్ రేఖను అవమానించిన హీరో తల్లి ఎవరో తెలుసా?

0
478

సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రెటీలు ప్రేమించుకోవడం విడిపోవడం సర్వసాధారణమే. వారు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో ఎప్పుడు ఎవరితో విడిపోతారు ఎవరికీ తెలియదు. ఈ విధంగా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన తరువాత మరొకరితో జీవితం పంచుకున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్ల ప్రేమ కథల గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు సీనియర్ హీరోయిన్ రేఖను ఒక హీరో తల్లి ఎంత దారుణంగా అవమానించారు. మరి ఆ హీరో ఎవరు ఎందుకు అవమానించారనే విషయానికి వస్తే…

సీనియర్ నటి రేఖ గురించి అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఈమె ఎప్పుడు లవ్ ఎఫైర్స్ గురించి వార్తలలో నిలిచేది. అప్పట్లో రేఖ.. వినోద్ మెహ్రాతో పీకల్లోతు ప్రేమలో ఉండేది. వీరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే రేఖను తన కుటుంబంలోకి ఆహ్వానించడానికి వినోద్ మెహ్రా తల్లి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకుని ఇంటికి వచ్చారు.

ఈ విధంగా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన వారిని చూసి వినోద్ మెహ్రా తల్లి ఎంతో ఆగ్రహానికి గురయ్యారు. తన తల్లికి నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె రేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చెప్పు తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నించారు. అలా వినోద్ మెహ్రా తల్లి తనని అవమానించడం తో అక్కడి నుంచి వెళ్లిపోయిన రేఖ కొన్ని రోజులపాటు వినోద్ మెహ్రాతో మాట్లాడకుండా ఉన్నప్పటికీ ఆ తర్వాత పరస్పరం వీరిద్దరు విడాకులు తీసుకుని దూరమయ్యారు.

ఇలా వినోద్ తల్లి రేఖను ఎన్నో ఇబ్బందులకు గురి చేయడంతో వినోద్ మెహ్రా నుంచి విడిపోయిన రేఖ ఆ తర్వాత ముఖేష్ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే అతను కూడా మరణించడంతో అతని మరణానికి కారణం కూడా రేఖ అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.