Oosaravelli: సాధారణంగా ఈ సృష్టిలో ఎన్నో రకాల జంతువులు పక్షులు కీటకాలు మనల్ని ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆశ్చర్యపరిచే వాటిలో ఊసరవెల్లి ఒకటి. అయితే ఊసరవెల్లిని మనం ప్రతి ఒక్కరూ చూసి ఉంటాం అది తరచూ రంగులు మారుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకే మాటపై నిలబడని వారిని కూడా ఊసరవెల్లితో పోలుస్తుంటారు.

అయితే చాలామంది ఇలా ఊసరవెల్లి రంగులు మార్చడానికి గల కారణం ఏమిటి అంటే శత్రువుల బారి నుంచి తనను తాను రక్షించుకోవడం కోసమే ఊసరవెల్లి ఈ విధంగా రంగులు మారుతుంది అనే సమాధానం చెబుతారు.

నిజానికి అసలు సమాధానం అది కాదు.ఊసరవెల్లి ఇలా ఎందుకు రంగులు మారుతుందనే విషయానికి వస్తే..ఊసరవెల్లి తరచూ రంగులు మార్చడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే తన శరీరంలోని ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేసుకోవడం కోసం ఇలా రంగులు మారడమే కాకుండా ఇతర ఊసరవెల్లికి రంగులు మారుతూ సంకేతాలు జారీ చేస్తాయని అర్థం.
మరోసారి తోక పెరగదు..
ఈ విధంగా ఇతర ఊసరవెల్లిలకు సంకేతాలు ఇవ్వడం కోసం తన శరీరంలో ఉన్న శక్తిని చూపించడం కోసం ఇలా ప్రకాశవంతంగా రంగులు మారుతూ ఉంటుంది. అయితే ఊసరవెల్లికి కొన్ని ప్రమాదాలలో తోక తెగిపోతే బల్లులు మాదిరిగా మరోసారి తోక పెరగదు. ఇలా ఊసరవెల్లి రంగులు మారడానికి అసలు సిసలైన కారణం ఇదే.































