Actress: సోషల్ మీడియా బాగా డెవలప్ అయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో విషయాలు క్షణాలు తెలిసిపోతున్నాయి ముఖ్యంగా వారి గత ఫోటోలు చిన్నప్పటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ అమ్మాయి హాలీవుడ్ మోడల్ రేంజ్ లో ఉన్నారు అయితే ఈమె త్వరలోనే మన టాలీవుడ్ హీరో కి భార్యగా తెలుగింటి కోడలుగా అడుగుపెడుతున్నారు.

మరి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా కొనసాగుతున్నారు. మోడల్ గా తన కెరియర్ ప్రారంభించి హీరోయిన్గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఈ ఫోటోలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా… అయితే ఈ ఫోటో హీరోయిన్ 10 సంవత్సరాల క్రితం ఫోటో. మరి ఈమెను గుర్తుపట్టారా..

మీరు ఊహించింది నిజమే ఈమె నటి శోభిత ధూళిపాళ్ల. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస భాష సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈమె కెరియర్ మొదట్లో మోడల్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు తెనాలిలో పుట్టిన ఈమె వైజాగ్ లో చదువులు పూర్తి చేశారు అనంతరం తన స్నేహితుల ప్రోత్సాహంతో 2013లో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆపై ఫిలిప్పీన్స్‌లో మిస్ ఎర్త్ 2013 పోటీల్లో పాల్గొన్న అవార్డు అందుకోలేక పోయారు.

అక్కినేని కోడలిగా…
2016లో రామన్ రాఘవ్ 2.0 అనే బాలీవుడ్ మూవీతో శోభిత సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె. గూఢచారితో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు ఇలా బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ సినిమాలలో నటిస్తే బిజీగా ఉన్న ఈమెగా రెండు సంవత్సరాలుగా అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమలో ఉన్నారు ఇక ప్రేమ విషయాన్ని నిశ్చితార్థంతో అధికారకంగా ప్రకటించారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.



























