Tollywood: ఎంతోమంది సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటారు ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో నటుడు సుమంత్ ఒకరు. తూనీగ తూనీగ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు సుమంత్ ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఈయన కెరియర్ లో మాత్రం తూనీగా తూనీగా కేరింత, లవర్స్ అనే సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమాల తర్వాత సుమంత్ పలు సినిమాలలో నటించిన ఆ సినిమాలో థియేటర్లలోకి ఎప్పుడు వచ్చి వెళ్లిపోయాయో కూడా ఎవరికీ తెలియదు. ఇలా తన కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు లేకపోయినా ఈయన ఆస్తులు మాత్రం వందల కోట్లని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇలా ఇండస్ట్రీలో హిట్ సినిమాలు లేకపోయినా వందల కోట్ల ఆస్తి రావడానికి కారణం లేకపోలేదు. ఈయన తండ్రి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతల సొంతం చేసుకున్నారు. ఈయన తండ్రి మరెవరో కాదు ఎంఎస్ రాజు. ఇలా స్టార్ ప్రొడ్యూసర్ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మాత్రం సరైన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు.
బడా ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు..
అప్పట్లో ప్రియమైన నీకు, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించి ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన నిర్మాతగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా పనిచేశారు సుమంత్ నటించిన తూనీగ తూనీగ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు అలాగే ఇటీవల నరేష్ పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి అనే సినిమాకి కూడా ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు.



























