Star Actress: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దివంగత నటుడు రఘువరన్ ఒకరు ఈయన సినిమాలో ఉన్నారంటే ఆయన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. రఘువరన్ ఎన్నో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో సుమారు 30 సినిమాల వరకు నటించిన ఈయన ప్రతి సినిమాలో కూడా విభిన్న పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..
ఇక చివరిగా బ్యాంక్ అనే సినిమాలో నటించిన రఘువరన్ ఈ సినిమా విడుదల సమయానికి అనారోగ్య సమస్యల కారణంగా 2008వ సంవత్సరంలో మరణించారు. అయితే ఈయన మరణించినప్పటికీ ఇప్పటికీ తన సినిమాలు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోయాయనే చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన సతీమణి గురించి ఒక వార్త వైరల్ గా మారింది. రఘువరన్ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నారనే విషయం చాలా మందికి తెలియదు.

ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించిన సీనియర్ నటి రోహిణిను రఘువరన్ వివాహం చేసుకున్నారు ఈమె కెరియర్ మొదట్లో హీరోయిన్గా నటించిన ప్రస్తుతం తల్లి పాత్రలకు కమిట్ అవుతూ వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇక రోహిణి రఘువరన్ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. వీరిద్దరి వివాహం 1996వ సంవత్సరంలో జరిగింది వీరికి ఒక కుమారుడు జన్మించారు. అయితే 2004 సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు.
సీనియర్ నటి రోహిణి..
ఇలా విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ వీరిద్దరూ మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా రఘువరన్ 2008వ సంవత్సరంలో మరణించారు. ఇక త్వరలోనే వీరి కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఇప్పటివరకు ఈ విషయం గురించి రోహిణి క్లారిటీ ఇవ్వలేదు.



























