Childhood: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో విషయాలు అందరికీ తెలిసిపోతున్నాయి. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలు క్షణాల్లోనే అందరికీ తెలుస్తూ ఉన్నాయి. ఇక సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు వాటిని మరింత వైరల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అమ్మ ఒడిలో కూర్చొని ఎంతో క్యూట్ గా చూస్తూ ఉన్నటువంటి ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈమె ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతున్నారు. ఇక ఈమె భారీ సినీ నేపద్యమున్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఈమె తల్లి కూడా స్టార్ హీరోయినే.
మరి ఈ ఫోటోలో ఉన్న ఈ క్యూట్ బేబీ ఎవరో గుర్తుపట్టారా… ఈమె నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు ఇప్పటికైనా గుర్తొచ్చిందా అవునండి ఈ ఫోటోలో ఉన్నటువంటి ఈ చిన్నారి మన మహానటి కీర్తిసురేష్. కీర్తి సురేష్ సీనియర్ హీరోయిన్ మేనక వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.
మహానటి కీర్తి సురేష్..
ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగడమే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకున్నారు. త్వరలోనే బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. 2013లో గీతాంజలి అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. 2016లో నేను శైలజతో టాలీవుడ్ ఎంట్రీ ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.

































