Panchatantra Kathalu: దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకత్వంలో డి.మధు నిర్మిస్తున్న తాజా చిత్రం పంచతంత్ర కథలు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాతో దర్శకుడు గంగను మోడీ శేఖర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నోయెల్, do
నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ లతో పాటు పలువురు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఐదు వేర్వేరు కథల ఆంథాలజీ కావడంతో ఈ సినిమాకు పంచతంత్ర కథలు అనే టైటిల్ ను పెట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి మోతెవరి అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కాగా ఈ పాటకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఎంఎం కీరవాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగానమును శేఖర్ దర్శకత్వంలో తనకి ఎక్కబోతున్న ఈ సినిమా ఐదు వేరువేరు కథలు అలాగే ఐదు వేరు వేరు జోనర్లతో రావడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని తెలిపారు.

అదేవిధంగా ట్రైలర్ చాలా బాగుందని, ఈ సినిమాలో క్యారెక్టరై జేషన్స్ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు ఎం ఎం కీరవాణి. ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాను అని తెలిపారు. కాగా ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూఏ సర్టిఫికెట్ను కూడా పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు చిత్ర బృందాన్ని అభినందించారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.































