మనలో చాలామంది చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ట్యాబ్లెట్లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. జలుబు, తలనొప్పి లాంటి సమస్యలను వేగంగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ట్యాబ్లెట్లపై ఆధారపడుతూ ఉంటారు. అయితే ట్యాబ్లెట్లను ఎక్కువగా తీసుకుంటే మనకు తాత్కాలికంగా ఆ ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం లభించినా భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఇష్టానుసారం ట్యాబ్లెట్లను వాడితే భవిష్యత్తులో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుంది. గడిచిన 15 సంవత్సరాలలో భారత్ లో ట్యాబ్లెట్ల వినియోగం భారీగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో వైద్యులు సైతం రోగికి వ్యాధిని తగ్గించాలనే ఉద్దేశంతో ఎక్కువగా యాంటీబయోటిక్స్ ను రాస్తుంటారు. ఎక్కువగా మందులు వాడితే శరీరంపై మందులు దుష్ప్రభావాలు చూపుతాయి.

మన అవసరాలకు, ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా యాంటీ బయోటిక్స్ ను వాడితే మంచిది. దేశంలో కరోనా వైరస్ విజృంభించినప్పటి నుంచి యాంటీ బయోటిక్స్ వినియోగం గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. చాలామంది విటమిన్ల ట్యాబ్లెట్లను వైద్యుల సూచనలు లేకుండా ఇష్టానుసారం వాడేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. మెడికల్ షాపుల్లో మందులు సొంతంగా కొనుగోలు చేయకూడదు.

ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత గురించి చైతన్యం పెరిగితే అనేక వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఇష్టానుసారం మందులను వినియోగించడం వల్ల అత్యవసర సమయాల్లో మందులు వాడినా ప్రయోజనం ఉండదు. భారతదేశంలో యాంటీబయోటిక్స్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఏకంగా 7 లక్షల మంది ఏటా చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here