సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువగా అనర్థాలు కూడా ఉన్నాయి. మన స్నేహితులతో పరిచయం కొనసాగించడమే కాకుండా ఎన్నో కొత్త కొత్త విషయాలను కూడా తెలుసుకోవచ్చు. కానీ సైబర్ నేరాలు, పరిచయం లేని వ్యక్తుల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

ఫేస్‌బుక్ స్నేహాలతో జరిగే మంచి ఎంత ఉందో, చెడు కూడా అంతే ఉంది. ఫేస్‌బుక్ పరిచయాలు, స్నేహాలు అనేక నేరాలకు దారితీస్తుంటాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకు ఫేస్‌బుక్ అనేక కంట్రోల్స్‌ని యూజర్లకు అందిస్తోంది. మనం పోస్ట్ చేసే కంటెంట్ ను ఎవరు చూడాలో వారు మాత్రమే చూసేందుకు ఫేస్‌బుక్ ప్రైవసీ, సెక్యూరిటీ కంట్రోల్స్ ఉపయోగించుకోవచ్చు.
మనకు విసుగు తెప్పించే వారిని బ్లాక్ కూడా చేసే వీలుంటుంది. ముందుగా ఎవరినైతే బ్లాక్ చేయాలనుకుంటున్నామో వారి ఫేస్ బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. అందులోని మెనూలో Block ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో అతడు మన అకౌంట్ కు సంబంధించి ఎలాంటి పోస్టులను చూడలేడు.. మనల్ని ట్యాగ్ కూడా చేయలేడు.
ఒకవేళ అతడిని మళ్లీ ఫ్రేండ్ గా స్వీకరించి అన్ బ్లాక్ చేయాలంటే.. మళ్లీ అతడి ఫేస్ బుక్ ప్రొఫైల్ కి వెళ్లి.. పర్సన్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. మెనూలో అన్ ఫ్రెండ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత అతడిని మనం ఫ్రెండ్ గా అనుమతి ఇస్తారా అనే కనఫర్ మేషన్ తీసుకొని మరో పాప్ అప్ ఆప్షన్ వస్తుంది. దానిపై ఓకె అని క్లిక్ చేస్తే.. అతడిని ఫ్రెండ్ గా స్వీకరించినట్లే. తర్వాత మన ఫ్రెండ్స్ లిస్ట్ లోకి వెళ్లి చూస్తే.. అతడి ఫేస్ బుక్ అకౌంట్ కనపడుతుంది.































