Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని దాదాపు 1569 ఎపిసోడ్లు పాటు ప్రసారమైనటువంటి ఈ సీరియల్ మంచి ఆదరణ పొందడంతో ఈ సీరియల్ కి సీక్వెల్ తీసుకువస్తున్నారు.

కార్తీకదీపం 2 ద్వారా నేటినుంచి ఈ సీరియల్ ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తండేల్ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలకు సంబంధించినటువంటి రీల్ వీడియోని నాగచైతన్య వాలంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇందులో భాగంగా నాగచైతన్య బుజ్జితల్లే.. వచ్చేత్తున్న కదే, కాస్త నవ్వవే` అని ప్రేమగా పిలుస్తాడు చైతూ.దీనికి సాయిపల్లవి కూడా అంతా బాగా రియాక్ట్ అవుతుంది. మొదట్లో బాధలో నుంచి ఆమె నవ్విన తీరు ఆకట్టుకోవడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ రీల్ ను డాక్టర్ బాబు వంటలక్క ఇద్దరు చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
సీరియల్ కి సీక్వెల్..
ఇక ఈ సీరియల్ నేటి నుంచి ప్రసారం కాబోతుంది ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు కార్తీకదీపం 2 ఇది నవ వసంతం అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సీరియల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమాలకు సీక్వెల్స్ రావడం చూసాము కానీ సీరియల్స్ కు సీక్వెల్ రావడం ఇది మొదటి సారి అని చెప్పాలి. ఇలా సీరియల్ కి సీక్వెల్ వస్తుంది అంటే ఈ సీరియల్ కి ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.


























