Doctor Ramadevi : కుప్పం లోకేష్ పాదయాత్రలో గుండె పోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిన నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఆయన చికిత్సకు సహకరిస్తున్నా బ్రెయిన్ లో డామేజ్ ఏర్పడింది అనే వార్త బయటికి వచ్చింది. గుండె ఆగినపుడు బ్రెయిన్ కి రక్తసరఫరా నిలిచిపోయి బ్రెయిన్ డామేజ్ ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే బ్రెయిన్ డామేజ్ తీవ్రతను బట్టి చికిత్స ఉంటుందంటూ చెబుతన్నారు డాక్టర్ రమాదేవి.

గుండె పనిచేస్తున్నా బ్రెయిన్ డామేజ్…
గుండె పోటు సమయంలో సీపీఆర్ చేసే సమయాన్ని బట్టి శరీరంలో మిగిలిన ఆర్గాన్స్ పనితీరు ఉంటుందని డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటూ చెప్పారు రమాదేవి. గుండె ఆగిపోయిన 4నిమిషాల్లోనే సీపీఆర్ చేస్తే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఎల్లపుడు డాక్టర్ అందుబాటులో ఉండడు కనుక సీపీఆర్ చేయడం అందరూ నేర్చుకోవాలని చెప్పేది అందుకే అంటూ వివరించారు. తారకరత్న కు కూడా గుండె ఆగిపోయిన వెంటనే సీపీఆర్ అందించారు కనుకే ఇప్పుడు ఆయన ఇంకా చికిత్సలో ఉన్నారని అయితే ఆయన బ్రెయిన్ కొంత డామేజ్ అయిందనే రిపోర్ట్స్ లో తెలుస్తోంది.

అయితే ఇపుడు ఆయన శరీరంలో అన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నా బ్రెయిన్ డామేజ్ ఉన్నది అని చెబుతున్నారు. ఇది చిన్న మెదడుకు డామేజ్ ఉన్నట్లయితే ప్రమాదకరం. అలా కాకుండా బ్రెయిన్ మిగిలిన భాగంలో అయితే కొంతవరకు ప్రమాదం తగ్గినట్లే అంటూ చెప్పారు. గుండె ఆగినపుడే కాకుండా బ్రెయిన్ కి రక్తం సరఫరా ఆగినపుడు కూడా బ్రెయిన్ డామేజ్ అవుతుంది అంటే బ్లడ్ క్లాట్స్ వంటి వాటి వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఇక రక్తం నుండి సరఫరా అయ్యే ఆక్సిజెన్ అందక పోయినా బ్రెయిన్ డామేజ్ జరగొచ్చు అంటూ డాక్టర్ రమాదేవి తెలిపారు. ఇక తారకరత్న గారి కండిషన్ ఇప్పటికీ క్రిటికల్ గానే ఉందని తెలిపారు. అయితే వెంటిలేటర్ అపి చికిత్స అందుకుంటున్నారని ఆయన స్వతహాగా ఊపిరి తీసుకోగలిగినపుడు వెంటిలేటర్ చికిత్స ను తీసేస్తారంటూ క్లారిటీ ఇచ్చారు.
































