సాధారణంగా పాములు ఎంతో విషపూరితమైన జీవులు. పాములు కరిస్తే తప్పకుండా కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. ఇలాంటి సందర్భంలోనే వైద్యులు పలు సర్జరీలను నిర్వహిస్తుంటారు. కానీ ప్రస్తుతం సాలీడు పురుగు కుట్టినా కూడా సర్జరీ తప్పడం లేదు. సాలిడ్ పురుగులే కదా అని తక్కువ అంచనా వేస్తే చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకోవాల్సి వస్తుంది.

తాజాగా అబ్బె టన్నెట్టా అనే 18 ఏళ్ల యువతి హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి తన స్నేహితులు తల్లిదండ్రులతో కలిసి వేల్స్ వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి తన స్నేహితులు అందరితో కలిసి సదరు మహిళ కార్వాన్ లో పడుకుంది. అయితే తనకు ఏదో కుట్టినట్టు అనిపించడంతో నిద్రలేచిన అబ్బే తన చుట్టు చూడగా తన పక్కన ఎంతో పెద్ద సాలీడు కనిపించడంతో యువతి అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టింది.
ఆ సాలీడు కుట్టినచోట ఆమె చెయ్యి వాపు రావడమే కాకుండా భరించలేని నొప్పి, ఎర్రగా కందిపోయింది. సాలీడు కుట్టడం వల్ల ఆమె చేతిని పక్కకు కదిలించలేని పరిస్థితి ఏర్పడిందని, ఎంతో నీరసంగా, గుండె వేగంగా కొట్టుకోవడం, వళ్లంతా కాలి పోయినట్లు అనిపించేదని మహిళ తెలిపింది. దీంతో తనను ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు సర్జరీ చేయాలని చెప్పినట్లు అబ్బె టన్నెట్టా తెలిపింది.
ఒకవేళ సర్జరీ చేయకపోతే మహిళకు సెప్సిస్ అవుతుందని వైద్యులు తెలపడంతో సర్జరీ చేయించుకుంది. మొత్తానికి సాలీడు కుట్టడంతో ఆ మహిళకు వైద్యులు సర్జరీ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ విషయంలో తను ఏ మాత్రం ఆలస్యం చేసిన సదరు మహిళ ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే లేదని వైద్యులు తెలిపారు.