Sammakka-Sarakka: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక సారక్క అన్న విషయం తెలిసిందదే. ప్రస్తుతం ఈ జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై ఓ డాక్యూమెంటరీని రూపొందించారు. దీనిని హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు.

దీనిని ప్రముఖ ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరి రూపొందించారు. దీనికి ఇతడు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అతడిని కవిత అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

తర్వాత పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్యను ఘనంగా సన్మానించారు. అంతరించిపోతున్న కళను బతికించడంలో రామచంద్రయ్య పాత్ర అమోఘం అంటూ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించడానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని సకినా రామచంద్రయ్య గుర్తుచేశారు.
ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగ కాంతారావు పాల్గొన్నారు.
అతడితో పాటు.. తెలంగాణ జాగృతి సభ్యులు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇక మరో విషయం ఏంటంటే.. సమ్మక్క సారక్క జాతరలో రామచంద్రయ్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ వనదేవతలకు ఆయన డోలు వాయిద్యం వాయిస్తూ పూజలు నిర్వహిస్తారు. ఈసారి కూడా జాతరలో ఆయన డోలు మోగనుంది.































