సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచలంచలుగా సినిమారంగంలో ఎదుగుతూ వచ్చారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం కలిగిన మెగాస్టార్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తర్వాత విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అతనిలో ఉన్న నటుడి లక్షణాలను చూసిన దర్శక నిర్మాతలు అతనికి హీరోగా అవకాశాలు ఇచ్చారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన చిరంజీవి ఇండస్ట్రీలోకి రావడానికి ఒక వ్యక్తి కారణం అంటూ ఎన్నో సందర్భాలలో తెలిపారు. వృత్తిపరంగా చిరంజీవి తండ్రి చీరాలలో ఎస్ఐ గా పనిచేసేవారు. ఆ స్టేషన్ లోనే ఒక కానిస్టేబుల్ చిరంజీవి చెప్పే డైలాగులకు ఎంతో అభినందించి మురిసిపోయేవారు. అతని మాటలను పెద్దగా పట్టించుకోని చిరంజీవి ఆ తర్వాత చీరాల పక్కనే ఉన్నటువంటి పేరాలకు చెందిన కానిస్టేబుల్ వీరయ్య ఒక రోజు నన్ను చూసి బాలీవుడ్ హీరోలా ఉన్నావని ప్రశంసించాడు. అర్జెంటుగా సినిమా ఇండస్ట్రీకి వెళితే మంచి అవకాశాలు వస్తాయని ఆరోజు కానిస్టేబుల్ వీరయ్య అన్న మాటలు తనపై చాలా ప్రభావం చూపాయని తెలిపారు.

అదేవిధంగా కానిస్టేబుల్ వీరయ్య తనని అప్పటికప్పుడు స్టూడియోకి తీసుకెళ్లి ఫోటోలు తీయించి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి పంపించారని, ఆ విధంగా అడయార్ ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు దక్కించుకున్నట్లు తెలిపారు. ఈ విధంగా కానిస్టేబుల్ వీరయ్య నింపిన స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చి నేడు ఈ స్థాయిలో ఉన్నానని చిరంజీవి ఎన్నో సందర్భాలలో వీరయ్య గురించి తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి తన రెండవ ఇన్నింగ్స్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ వరుస సినిమాలను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు.































