సాధారణంగా అన్ని జంతువులలో కెల్లా మనుషులు ఎంతో తెలివైన వారు అని చెబుతుంటారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మనుషులతో పాటుగా జంతువులు కూడా ఎంతో తెలివిగా, ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాయి.వాటికి శిక్షణ ఇస్తే మనుషులకన్నా ఎంతో అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శిస్తున్నాయని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా ఈ సంఘటనే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు.

సాధారణంగా మన ఇంట్లో పెంపుడు జంతువుగా చాలామంది కుక్కలని పెంచుకోవడం చూస్తుంటాము. వాటికి మనం ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నప్పుడు అవి కూడా మన పై ఎంతో విశ్వాసం ప్రదర్శిస్తాయి. ఈ క్రమంలోనే మనం వాటికి ఏ పని చెబితే అవి ఎంతో చాకచక్యంగా చేసి చూపెడతాయి. ఇలాగే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు ఎంచక్కా గణితం నేర్పిస్తున్నాడు. కుక్క ఏంటి..? లెక్కలు చెప్పడం ఏంటి? అని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే.
ఈ వీడియోలో ఓ వ్యక్తి తను ఎన్ని అంకెలను చెబితే అందుకు అనుగుణంగా కుక్క అన్నిసార్లు అరుస్తోంది. కేవలం అంకెలు మాత్రమే కాకుండా కూడికలు, తీసివేతలు కూడా చేస్తోంది. ఒకటి అంటే ఒకసారి అరవడం, మూడు అంటే మూడు సార్లు అరవడం చేస్తుంది. అదేవిధంగా 5 -1 అంటే నాలుగుసార్లు అరుస్తుంది.
ఈ విధంగా తన యజమాని ఏం చెబితే కుక్క అందుకు స్పందిస్తూ అన్నిసార్లు అరవడం చేస్తోంది. ప్రస్తుతం ఈ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కుక్క తెలివి తేటల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు చూసేయండి.































