కోవిడ్ వ్యాక్సినేషన్ తరువాత వచ్చిన సర్టిఫికేట్ ను సోషల్ మీడియాలో శేర్ట్ చేస్తున్నారు కొంతమంది. అయితే ఈ విషయంపై కేంద్రం కొన్ని సూచనలు చేసింది. వ్యాక్సిన్ సర్టిఫికేట్ ను సోషల్ మీడియాలో షెట్ చేయొద్దని సూచిస్తోంది ప్రభుత్వం.

అందులో పేరు, మీ వయస్సు, ఈ ఆధార్ నంబర్ సహా వ్యక్తిగత వివరాలు అన్నీ ఉంటాయని, అవి మోసగాళ్ళ చేతుల్లోకివేలితే దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హేచారిస్తోంది ప్రభుత్వం. వ్యాక్సిన్ రెండు డోసులు తరువాత ఆరోగ్యసేతు యాప్ లేదంటే కోవిన్ పోర్టల్ ద్వారా సర్టిఫికేట్ లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు సహా భవిష్యత్తులో పలు అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.































