వేసవికాలం మొదలవడంతో ప్రజలు తరచూ దాహానికి గురవుతుంటారు. అయితే ఈ వేసవి తాపం తగ్గించు కోవడం కోసం తరచూ చల్లని నీటిని తీసుకుంటూ ఉంటారు. కేవలం చల్లని నీటిని తాగటం వల్ల మన శరీరానికి సరైన మోతాదులో విటమిన్లు లభించవు. అదేవిధంగా వేసవి కాలంతో పాటు కరోనా మహమ్మారి వెంటాడటంతో ఎక్కువగా విటమిన్ లు లభించే టటువంటి పానీయాలను సేవించాలి. ఈ విధంగా విటమిన్లు సమృద్ధిగా లభించే ద్రావణాలు తాగడం వల్ల మన శరీరానికి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే ముఖ్యమైన మూడు పానీయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

- కుకుంబర్-బచ్చలి కూర రసం:
అరటి, దోసకాయ, బచ్చలి కూర, అల్లం ముక్కలను 10 నిమిషాల పాటు మిక్స్ చేసి వీటి నుంచి రసం బయటకు తీయాలి. ఆ తరువాత ఈ రసంలోకి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలుపుకొని తాగడం వల్ల మన శరీరానికి విటమిన్ ఎ, కె, సి, మెగ్నీషియం, కాల్షియం, రాగి మరియు పొటాషియం లభిస్తాయి. - పుచ్చకాయ -పుదీనా జ్యూస్:
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అవిసె గింజలు, గుమ్మడి గింజలతో పాటు పుచ్చకాయ, పుదీనా ఆకులు కూడా ఎంతగానో దోహదపడతాయి. పుచ్చకాయ, పుదీనా ఆకుల ముక్కలు వేసి బాగా రుబ్బుకోవాలి పదినిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని తాగటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తితో పాటు, జింక్ ఒమేగా 3 గణనీయంగా పెరుగుతాయి. - డ్రై ఫ్రూట్స్ జ్యూస్:
జీడిపప్పు బాదం అత్తిపండ్లను 30 నిమిషాల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలోకి కొద్దిగా తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల మన శరీరానికి విటమిన్ బి, సి, ఎ లను పెంపొందించుకోవచ్చు.ఈ మూడు రకాల జ్యూస్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి రోగనిరోధక శక్తితో పాటు విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి.






























