గత సంవత్సర కాలం నుంచి కరోనా వ్యాధి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ ఎక్కువగా వారి రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆయుర్వేదానికి అధిక ప్రాముఖ్యత చోటు చేసుకుంది.మన శరీరానికి తగినంత రోగనిరోధక శక్తి ఉండటం వల్ల ఈ మహమ్మారి బారిన నుంచి తప్పించుకోవచ్చని మన ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసుకున్న పానీయాలను, హెర్బల్ టీ లను సేవించి రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు.

కరోనా క్లిష్ట పరిస్థితులలో రోగనిరోధకశక్తి ఎంతో కీలకం. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే గోల్డెన్ మిల్క్ తప్పనిసరిగా తాగాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలన్నీ గోల్డెన్ మిల్క్ కి అధిక ప్రాధాన్యత కల్పించారు. గోల్డెన్ మిల్క్ అని పిలువబడే పానీయాన్ని తెలుగులో పసుపు పాలుగా పిలుస్తారు.పసుపు పాలు తాగడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యలనుంచి నివారణ కల్పిస్తుందనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే పసుపును గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నారు. పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఈ పసుపు పాలు తాగుతూ, రోజుకు రెండుసార్లు మన ఇంట్లో దొరికే నల్ల మిరియాలు, తులసి ఆకులు, అల్లం ముక్కలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి హెర్బల్ టీ తయారు చేసుకుని తాగాలనీ ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రతిరోజు ఈ విధంగా పసుపు పాలను హెర్బల్ టీ తాగటం వల్ల కరోనా నుంచి పూర్తిగా విముక్తి కలిగిస్తుందనే హామీ ఇవ్వలేనప్పటికీ మన శరీరానికి తగినంత రోగనిరోధక శక్తిని మాత్రం అందిస్తుంది. అదేవిధంగా మనలో ఏర్పడిన ఆందోళన, ఒత్తిడి, ఇతర నొప్పులను అధిగమించడానికి ఈ గోల్డెన్ మిల్క్, హెర్బల్ టీ కీలకపాత్ర పోషిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here