Dubbing janaki: ముందుగా తిన్నాననీ కాలితో క్యారియర్ తన్నింది: డబ్బింగ్ జానికి

0
377

Dubbing Janaki: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డబ్బింగ్ జానకి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె ఎన్నో వెండితెర సినిమాలలో నటించడమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. అదే విధంగా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు.

ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డబ్బింగ్ జానకి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.
డబ్బింగ్ జానకి 1958లో విడుదలైనటువంటి భూకైలాస్ సినిమాతో వెండితెర నటిగా పరిచయమయ్యారు.గాంధీ సినిమాకు కస్తూరిబా పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో ఈమె డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మారిపోయారు.అయితే ఇండస్ట్రీలో షావుకారు జానకి సింగర్, జానకి ఉండడంతో తాను డబ్బింగ్ చెప్పడం వల్ల తన పేరు డబ్బింగ్ జానకి అని పెట్టారని ఈమె తెలియజేశారు.

ఇక తనకు సినిమా అవకాశం రావడం గురించి మాట్లాడుతూ నేను మా ఆయన బస్సులో వెళ్తే తెలుగులో మాట్లాడుతున్నాం ఆ సమయంలో ఒక డైరెక్టర్ మమ్మల్ని చూసి మీరు తెలుగువారా అని అడిగారు అవునని సమాధానం చెప్పడంతో సినిమాలలో నటిస్తారా అంటూ స్టూడియో అడ్రస్ ఇచ్చారని అలా భూకైలాస్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు.

Dubbing Janaki: నా కన్నా పెద్ద నటి ఏమీ కాదు

ఇక ఈ కార్యక్రమంలో యాంకర్ డబ్బింగ్ జానకిని ప్రశ్నిస్తూ మీరు ముందుగా భోజనం చేశారని ఎవరో ఒక నటి కాలితో క్యారేజ్ మొత్తం తన్నారట ఎవరు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జానకి సమాధానం చెబుతూ తన పేరు చెప్పను అయితే ఆమె నా కన్నా పెద్ద నటి ఏమీ కాదు. మేమిద్దరం ఒకే రూమ్ లో ఉన్నాము.నాకు రాత్రి త్వరగా తిని పడుకోవడం అలవాటు అందుకే మాకు వచ్చిన క్యారేజ్ లో కాస్త పెట్టుకొని తిని పడుకున్నాను అయితే ఆమె వచ్చి క్యారేజ్ తిన్నాను అని తెలిసి ఒక్క తన్ను క్యారేజ్ తన్నిందనీ, నేను ఆ సంఘటన చూసిన ఏమి మాట్లాడకుండా నిద్రపోయాను అంటూ ఈ సందర్భంగా డబ్బింగ్ జానకి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.