కస్టమర్లకు శుభవార్త.. పోస్టాఫీస్ లో ఈ అకౌంట్ తెరిస్తే కళ్లు చెదిరే లాభం..?

0
156

ఈ మధ్య కాలంలో పోస్టాఫీస్ లు కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా కొత్తకొత్త స్కీమ్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ద్వారా కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలు చేకూరేలా చేస్తున్నాయి. రిస్క్ లేకుండా పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ స్కీమ్ లలో డబ్బులు పెట్టడం వల్ల అదిరిపోయే రాబడి పొందడంతో పాటు నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి.

పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవాళ్లకు కేంద్రం నుంచి హామీ ఉంటుంది కాబట్టి ఎంత మొత్తం డిపాజిట్ చేసినా ఎలాంటి రిస్క్ ఉండదు. కనీసం 1,000 రూపాయల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. పరిమితి లేదు కాబట్టి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ ద్వారా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ కు సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు. కాలపరిమితిగా ఉంది. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ లకు హామీ ఉండదు కానీ పోస్టాఫీస్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ లకు హామీ ఉంటుంది.

ప్రస్తుతం పోస్టాఫీసులు 6.7 శాతం వడ్డీ చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ లకు అందిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లతో పోలిస్తే ఈ వడ్డీ రేటు చాలా ఎక్కువ. ఉదాహరణకు 10 లక్షల రూపాయలు పోస్టాఫీస్ లో డిపాజిట్ చేస్తే ఐదేళ్లకు 14 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఏకంగా 4 లక్షల రూపాయల లాభం సులభంగా పొందవచ్చు. ఈ స్కీమ్ తో పాటు ఇతర స్కీమ్ ల ద్వారా కూడా కస్టమర్ల,కు ప్రయోజనాలు చేకూరుతాయి.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర, రికరింగ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, టైమ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్ ద్వారా కూడా ప్రయోజనాలను పొందవచ్చు. ఎంచుకునే స్కీమ్ ల వల్ల వడ్డీ రేట్లలో మార్పులు ఉండటంతో పాటు ప్రయోజనాలలో మార్పులు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here