ప్రస్తుత కాలంలో చాలా మంది వారి ఆహారంలో భాగంగా ఉదయమే ఇడ్లీ ,దోశ వంటి అల్పాహారానికి బదులుగా ఓట్స్ తినడం చేస్తుంటారు. ఈ విధంగా చాలామంది ఓట్స్ ను వివిధ రకాల కూరగాయలు నట్స్ వంటి వాటిని ఉపయోగించి తయారు చేసుకొని తింటారు. ఈ విధంగా ఓట్స్ తినడం వల్ల శరీర బరువు తగ్గుతారనే భావనలో ప్రతి ఒక్కరు ఉంటారు. ఓట్స్ లో కూడా వివిధ రకాల ఓట్స్ మనకు మార్కెట్లో లభిస్తాయి.రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ ఈ రెండు రకాల ఓట్స్ ను కూడా బేకింగ్ లో కుక్కీస్ వంటి వాటిని తయారు చేసుకోవడానికి వాడతారు.

వీటిలో స్టీల్ కట్ ఓట్స్ ను తక్కువ ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. ఈ విధమైన ఓట్స్ తయారు చేయడానికి ఓట్స్ ను చాప్ చేసి తయారుచేస్తారు. అదేవిధంగా రోల్డ్ ఓట్స్ స్ట్రీమింగ్ మరియు ఫ్లేటనింగ్ ప్రాసెస్ చేసి వీటిని తయారు చేస్తారు. ఇలా చేయటం వల్ల అవి సాఫ్ట్‌గా మారుతాయి. ఈ విధంగా రెండు వేర్వేరు రకాలుగా ప్రాసెసింగ్ చేసే ఓట్స్ లో ఇంచుమించు ఒకే విధమైనటువంటి పోషక పదార్థాలు ఉంటాయి.
స్టీల్ కట్ ఓట్స్ ను తక్కువ ప్రాసెస్ చేయడం వల్ల దీనిలో కొద్దిగా అధిక మోతాదులో న్యూట్రియన్స్ లభిస్తాయి. ఆరోగ్యానికి రెండు రకాల ఓట్స్ మంచిదే అయినప్పటికీ శరీర బరువు తగ్గాలనుకునేవారు మాత్రం రోల్డ్ ఓట్స్ కన్నా స్టీల్ కట్ ఓట్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.ఇందులో ఫైబర్ అధికంగా ఉండటంతో పాటు కొంత పరిమాణంలో తీసుకున్నప్పటికీ ఎక్కువ కడుపు నిండిన భావన కలుగుతుంది. అందుకే రోల్డ్ ఓట్స్ కన్నా స్టీల్ కట్ ఓట్స్ తీసుకోవడం ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.































