
డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. ముఖ్యంగా బాదం (Almonds), వాల్‌నట్స్ (Walnuts) వంటి వాటిలో ఉండే పోషకాల వల్ల ప్రతీ రోజూ తీసుకోవాలని చాలామంది భావిస్తారు. కానీ ‘చాలా మంచిది కాబట్టి ఎక్కువగా తింటే ఇంకా మంచిదా?’ అన్న అలోచన మాత్రం ప్రమాదకరం. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అధిక మోతాదులో తినడం గుండెపై భారం పెంచే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బాదం – పోషకాల గని
బాదంలో విటమిన్ E (యాంటీ-ఆక్సిడెంట్), మ్యాగ్నీషియం (గుండె ఆరోగ్యానికి మంచిది), ప్రోటీన్, మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడం నుండి బరువు నియంత్రణ వరకూ సహాయపడతాయి.
వాల్‌నట్స్ – మెదడు & గుండెకు బంగారు ముద్ద
వాల్‌నట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడమే కాదు, గుండె రోగాల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్మోన్ల సమతుల్యతకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
ఇతర డ్రై ఫ్రూట్స్ ప్రయోజనాలు
కాజూ, ఖర్జూరం, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
ఎక్కువైతే ముప్పే!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదన్న కారణంగా అధికంగా తింటే సమస్యలు తప్పవు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో సహజంగా:
- అధిక కొవ్వు (కేలరీలు)
- అధిక చక్కెర (ముఖ్యంగా ఖర్జూరం, కిస్మిస్‌లలో)
కలిగి ఉంటాయి. అందువల్ల ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, మరియు శరీరంలో పేరుకుపోయే అదనపు కొవ్వు వల్ల గుండెపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు రావచ్చు.
రోజు ఎంత డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి?
నిపుణుల సూచన ప్రకారం:
- రోజుకు 20–30 గ్రాముల వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం సరైన మోతాదు. (సుమారు 5-6 బాదం, 2-3 వాల్‌నట్స్ కలిపి).
- ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, అదనపు చక్కెర లేదా కొవ్వు నిల్వలను నివారిస్తుంది.
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచివే… కానీ మోతాదే మహత్తరం! రోజుకు కొద్దిగా తింటే ఔషధంలా పనిచేస్తుంది, అతిగా తింటే గుండెకు భారంగా మారే ప్రమాదం ఉంది.































