Nagababu: కూటమిలో ఓటమి భయం మొదలైందని స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం అనేది కష్టతరంగా మారుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ ప్రత్యర్థులపై బురద చల్లే ప్రయత్నాలు భారీగా చేస్తున్నారని తెలుస్తుంది. ఓటమి భయం కారణంగానే అవాస్తవాలను ప్రచారం చేస్తూ నవ్వుల పాలవుతున్నారు కూటమి సభ్యులు.

ఈ క్రమంలోనే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఈసీ చేత తిట్లు తిన్నారు. మరి కొన్ని గంటలలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం వైసిపి నేతలు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని నాగబాబు ఆరోపణలు చేశారు.
పిఠాపురం ఓటర్లందరికి కూడా ముందుగానే డబ్బులు ఇచ్చి వేలుపై సిర గుర్తులు పెడుతున్నారు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఈసీ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయంపై ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ చేతి వేలిపై పెట్టే సిరా గుర్తు కేవలం భారత ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉంటుందని తెలిపారు.
అలాంటి సిరా ఎక్కడ ఉండదు..
ఈ సిరాతో పెట్టినటువంటి గుర్తు చేరిపిన చెరిగిపోదు అలాంటి సిరా కేవలం ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉంటుందని అది ఎక్కడా కూడా ఉండదని తెలిపారు.ఇక నాగబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమంటూ ఎన్నికల కమిషన్ ఈ వ్యాఖ్యలను ఖండించింది. ఇక ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఏదైనా ఒక విషయం మాట్లాడే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిది అంటూ నాగబాబుకు కౌంటర్ ఇస్తున్నారు.





























