ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో 18 సంవత్సరాల వయసు పైబడిన యువతీ యువకులు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు.ఈ విధంగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మన శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి కరోనా వైరస్ పై దాడి చేసి వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని మనకు తెలిసిందే.

కరోనా వైరస్ కేవలం వ్యాధి తీవ్రతను తగ్గించడం కాకుండా మన శరీరంలో విద్యుత్ ప్రవహింప చేస్తోందని తెలుస్తోంది. వ్యాక్సిన్ వేయించుకున్న చోట విద్యుత్ బల్బ్ పెడితే అమాంతం ఆ లైట్ వెలిగిన ఘటన కర్నాటకలోని హుబ్లీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే హుబ్లీలోని సుమంత్, దీక్ష అక్కా తమ్ముడు ఇటీవలే వీరిద్దరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత సుమత్ ఎల్ఈడి బల్బు తీసుకొని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ బల్బు వ్యాక్సిన్ వేయించుకున్న చోట తగలగానే అమాంతం లైట్ వెలిగింది.
ఈ విధంగా వ్యాక్సిన్ వేసుకున్న చోట లైట్ వెలగగానే ఎంతో ఆశ్చర్యపోయిన సుమత్, ఆ తరువాత దీక్ష కూడా ఈ ప్రయోగం చేసింది. ఆమెకి కూడా వ్యాక్సిన్ వేయించుకున్న చోట బల్బు పెట్టగానే వెలగడంతో ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ తరువాత బల్బును శరీరంలోని ఇతర భాగాలకు పెట్టిన వెలగని బల్బులను కేవలం వ్యాక్సిన్ వేయించుకున్న చోట తాకగానే వెలగడంతో ఎంతో షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన ఆ నోటా ఈ నోటా పాకడంతో ఈ వింతను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ఇది కేవలం అపోహలు మాత్రమేనని, ఇది వింత కాదు..పబ్లిసిటీ స్టంట్ అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈ విధంగా ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు వారికి తోచిన రీతిలో కామెంట్లు పెడుతున్నారు.
































