Ester noroha: భీమవరం బుల్లోడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి ఎస్తర్ నోరోహ. ఇలా ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె సింగర్ నోయల్ తో ప్రేమలో పడ్డారు. ఇలా కొన్ని నెలల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

ఇక వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.కానీ వీరి వివాహం కేవలం మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోయిందని చెప్పాలి.పెళ్లి జరిగిన ఆరు నెలలకి వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోవడం కూడా జరిగింది.ఇక వీరి విడాకుల గురించి నోయల్ మాజీ భార్య పలు సార్లు ప్రస్తావించారు.ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి తన విడాకుల గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నోయల్ తన నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వెంటనే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి సింపతి క్రియేట్ చేసుకున్నారు. ఇలా తనని దోషిగా చిత్రీకరించి నేనే తప్పు చేశాను అనేలా తాను సృష్టించారని ఈమె వెల్లడించారు. ఈ క్రమంలోనే నాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగిందని ఎస్తర్ ఈ తెలిపారు.

Ester noroha: అతని నిజ స్వరూపం బయటపడింది..
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి నేను హైదరాబాదులో కనక కనపడితే నాపై యాసిడ్ తో దాడి చేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చారంటూ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె వెల్లడించారు.అయితే అసలు నిజం ఏమిటో నాకు మాత్రమే తెలుసు పెళ్లి జరిగినా 16 రోజులకే నోయల్ నిజస్వరూపం బయటపడింది.తను నా నమ్మకాన్ని బ్రేక్ చేశారు. అందుకే తనతో కలిసి ప్రయాణం చేయలేనని భావించి తనతో విడాకులు తీసుకున్నానని ఈ సందర్భంగా ఎస్తర్ విడాకుల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































