Sanjjanaa Galrani: శాండల్ వుడ్ డ్రగ్స్ కుంభకోణంలో కన్నడ నటి సంజనా గల్రానీ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆమెను 2020 సంవత్సరంలో పోలీసులు అరెస్టు చేయగా.. అందే సంవత్సరం డిసెంబర్ నెలలో వైద్య కారణాలతో.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

బెంగళూరులో కార్డియోవాస్కులర్ సర్జన్ అయిన డాక్టర్ అజీజ్ పాషాతో ఆమె 2021లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె దాదాపు మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తర్వాత ఆమెకు వివాహం అయిందని సోషల్ మీడియాలో వార్తలు రాగా.. దానిని ఆమె అధికారికంగా.. వైద్యుల దినోత్సవం రోజున ప్రకటించింది.

దీని తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదు. కానీ మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంజ్జనా గల్రానీ తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైందనే వార్తలతో కన్నడ మీడియాలో హల్చల్ చేస్తోంది.
బుజ్జిగాడు సినిమాలో మెరిసిన నటి..
ఆ నోట.. ఈ నోట ఈ విషయం ఆమె వద్దకు చేరడంతో.. తన విడాకుల గురించి స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా.. సోషల్ మీడియాలో పుకార్లను స్పష్టించొద్దని.. అవన్నీ అబద్ధమని.. తాము బాగానే ఉన్నామని చెప్పుకొచ్చింది. ఇలాంటి తప్పుడు వార్తలు రాసే వారిపై చర్యలు తీసుకుంటానని.. మీడియా వారిని హెచ్చరించింది.‘‘నాకు సంబంధించి ఏ పబ్లికేషన్, పబ్లిషర్ అయినా ఎటువంటి రుజువు లేకుండా ఇలాంటి చెత్త వార్తలు రాస్తే.. సహించను అంటూ ఘాటుగా చెప్పింది’’. కరోనా మహమ్మారి కారణంగా తన పెళ్లికి ఎవరినీ పిలవలేదని చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు తెలుగులో బుజ్జిగాడు సినిమాలో నటించింది. తర్వాత సహనటిగా.. హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపుతో దూసుకుపోతోంది.
































