Ex Minister Annayyagari Sai Prathap : సుధీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో విధేయుడుగా ఉంటూ రాజంపేట నుండి లోకసభకు ప్రాతినిద్యం వహించిన అన్నయ్యగారి సాయి ప్రతాప్ గారు ఇటీవల జరిగిన బలిజ సభలలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు. తాను క్షత్రియ బలిజ అవడం వల్ల ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. అలాగే తనకు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కి ఉన్న స్నేహం గురించి తెలిపారు.

పత్రికల్లో రాసే ముందే జంజం తీసేయ్…
రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో మొదటి నుండి మిత్రుడని, మా ఇద్దరిది మంచి స్నేహం అంటూ కులాలు వేరైనా పెద్దలు నేర్పించిన సంస్కారం వల్లే మా స్నేహం నిలబడింది అంటూ బలిజ సభలో తెలిపారు. ఇక రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో తనకు 1984 లో అడగకుండానే పార్లమెంటుకు పోటీ చేయమని టికెట్ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి అంటూ అప్పటి విషయాన్ని చెప్పారు. నన్ను ఒక్కమాటైనా అడగలేదు నేను పోటీ చేయను అంటే అని సాయి ప్రతాప్ అనగా నీ చేత్తో కొంచం విషం ఇవ్వు సాయి అని అంటూ రాజశేఖర్ రెడ్డి చెప్పారట.

ఇక ఆ సమయంలో ఒక బలిజ కులస్థుడికి సీట్ ఇచ్చామని చెబుతే ఒక కాంగ్రెస్ నేత అతను బలిజ కాదు క్షత్రియుడు రాజుల వంశానికి చెందిన వాడు అని అన్నారట. వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు అడిగితే అవును నాకు జంధ్యం ఉంది పెనుగొండ రాజులకు బంధువులం, రాయల వారు అన్నయ్య అని మా పూర్వికులను పిలవడం వల్లే మాకు అన్నయ్యగారి అనే ఇంటి పేరు వచ్చింది అని చెప్పగా అవన్నీ నాకు తెలియదు సాయి కానీ పత్రికల వాళ్ళు ప్రచారం చేయకముందే ఆ జంధ్యం తీసేయ్ నాకోసం అని అడిగారట. అలా బ్రాహ్మనుల ద్వారా శాస్త్రోక్తంగా జంధ్యం తీసేసారట ప్రతాప్ సాయి గారు. ప్రతాప్ సాయి గారు బలిజ కులస్థుడైనా రాజ వంశానికి చెందినవాడు అని క్లారిటీ ఇచ్చారు.


































