సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడుతూ ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లను విడుదల చేస్తున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో అంటే తప్పనిసరిగా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే ఆర్య ఆర్య-2 రంగస్థలం సినిమాలో ఉన్న ఐటం సాంగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలకు మించి అనేలా పుష్ప సినిమాలో ఐటం సాంగు ఎంతో అద్భుతంగా రూపొందించారు. ఇక ఈ పాటలో సమంత డాన్స్ చేయడం ఈ పాటకు మరింత హైలెట్ అయ్యింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాట విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది.
ఇక పోతే ఈ పాట ఎవరు పాడారు ఆమె ఎవరు అనే విషయానికి వస్తే ఈ పాట పాడిన సింగర్ ఇంద్రావతి చౌహన్ ఈ పాట ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇక ఈమె ఎవరు అంటే స్వయానా సింగర్ మంగ్లీ సోదరి. బోల్ బేబీ బోల్ వంటి సింగింగ్ షోలలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఇంద్రావతి చౌహాన్ ప్రస్తుతం పుష్ప ఐటమ్ సాంగ్ ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.
ఊ ఉ అంటావా అంటూ హావభావాలను వ్యక్తపరుస్తూ పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది ఈ క్రమంలోనే అందరి దృష్టి ఈమె పై పడిందని చెప్పవచ్చు.షూటింగ్ పనులన్నింటిని పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీ ఒకేసారి అన్ని భాషలలో విడుదలకు సిద్ధమైంది.































