Indian Idol Telugu: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మ్యూజిక్ తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. 2009లో రవితేజ కిక్ మూవీతో తొలి మ్యూజిక్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల కరోనా బారి పడిన థమన్.. ప్రస్తుతం కోలుకున్నాడు.

ఇదిలా ఉంటే ఇటీవల అఖండ మూవీకి ఇచ్చిన బీజీఎంతో థమన్ పేరు మారుమోగింది. థమన్ కొట్టిన బీజేఎంకు థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థమన్ మ్యూజిక్ తో థియేటర్లలో బాక్సులు బద్దలయ్యేంత పని అయింది.

దీంతో పాటు ప్రస్తుతం థమన్ ‘భీమ్లానాయక్’ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ‘ సర్కారి వారి పాట’కు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు థమన్.
ఆహాలో త్వరలో రాబోతోంది..
ఇదిలా ఉంటే థమన్ కు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఆహాలో త్వరలో రాబోతున్న ‘ఇండియన్ ఐడల్’ రియాలిటీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆహాలో సమంత ‘సామ్ జామ్’, లేటెస్ట్ గా బాలయ్య హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘ అన్ స్టాపబుల్‘ షోలు భారీ హిట్ అయ్యాయి. దీంతో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న ఇండియన్ ఐడల్ కూడా పెద్ద సక్సెస్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. థమన్ జడ్జిగా వస్తే షోకు ఖచ్చితంగా మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని నిర్వహకులు అనుకుంటున్నారు.






























