అంతరించిదనుకుంటే.. 100 ఏళ్ళ తర్వాత తిరిగి ప్రత్యేక్షం..?

0
63

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో జంతువులు పేర్లను కానీ వాటి ఆకారం కానీ మనకు తెలియడం లేదు. ఈ విధంగా ఇప్పటికే ఎన్నో జీవులు అంతరించి పోయాయి. ఆ విధంగా అంతరించి పోయిందనుకున్న జీవి ఏకంగా వంద సంవత్సరాల తర్వాత తిరిగి కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వంద సంవత్సరాల క్రితం అంతరించిపోయిందనుకున్న ఫెర్నాన్‌డినా జెయింట్‌అనే తాబేలు తిరిగి ఇప్పుడు ప్రత్యక్షం కావడంతో శాస్త్రవేత్తలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమి పై ఏర్పడిన అనేక జీవ మార్పులకు ఇప్పుడు ప్రత్యక్షమైన తాబేలు ప్రత్యక్షసాక్షి అని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ విధమైనటువంటి జాతికి చెందిన తాబేలు వివిధ ప్రాంతాలలో కనిపించేవి. అయితే క్రమంగా ఈ తాబేలు అంతరించిపోయాయి.

ఈ క్రమంలోనే ఈ జాతికి చెందిన తాబేలు పూర్తిగా అంతరించిపోయాయి అని శాస్త్రవేత్తలు భావించిగా 2019 వ సంవత్సరంలో ఈక్విడార్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలాపెగాస్‌ ద్వీపంలో ఈ తాబేలు దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఈ తాబేలు కనపడటంతో శాస్త్రవేత్తలు ఇది ఫెర్నాన్‌డినా తాబేలా? కాదా? అనే విషయం శాస్త్రవేత్తలకు తెలియడం లేదు.

ఈ క్రమంలోనే ఈ తాబేలు డీఎన్ఏ పరీక్షలకు పంపించగా… ఈ పరీక్షలలో 2019 వ సంవత్సరంలో జరిగిన తాబేలు ఫెర్నాన్‌డినా జాతికి చెందిన తెలియడంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చివరిసారిగా ఈ జాతికి చెందిన తాబేలును 1960వ సంవత్సరంలో చూసినట్లు రికార్డులలో నమోదయింది. తాజాగా ఇప్పుడు మరోసారి కనిపించడంతో ఈ తాబేలు కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది ప్రేమికులను ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here