దేశంలోని ప్రజలకు ఈ కామర్స్ సైట్లు, ప్రముఖ కంపెనీలు పండుగను ముందుగానే తెస్తున్నాయి. వాషింగ్ మెషీన్, స్మార్ట్ ఫోన్, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. బీపీఎల్, వివో, పానాసోనిక్, రియల్‌మి, శాంసంగ్, ఎల్జీ కంపెనీలు ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై, ప్రీమియం స్మార్ట్ ఫోన్లను చాలా తక్కువ ధరకే అందించడానికి సిద్ధమవుతున్నాయి.


కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గతేడాదితో పోలిస్తే కంపెనీలకు భారీగా నష్టాలు వాటిల్లాయి. ప్రీమియం స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ పై ఏకంగా 50 శాతం తగ్గింపు ఇవ్వడం ద్వారా భారీగా అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ బంపర్ డిస్కౌంట్ల వల్ల వినియోగదారులకు లాభాల శాతం పెరగనుందని, నష్టాల శాతం తగ్గుతుందని తెలుస్తోంది. అయితే కంపెనీలు ఎక్కువ ఖరీదు ఉన్న వస్తువులు, స్మార్ట్ ఫొన్లపైనే ఆఫర్లు అందుబాటులో ఉంచడం గమనార్హం.

ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి పండుగ ఆఫర్ల వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరదని తెలుస్తోంది. స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలనుకునే వారికి 10 నుంచి 20 శాతం తక్కువ మొత్తానికే టీవీలు అందుబాటులోకి రానున్నాయి. పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ ప్రీమియం ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

ఎల్‌జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తక్కువ డిమాండ్ ఉన్న వస్తువులపై ఆఫర్లు ప్రకటించామని.. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్ లాంటి ఎక్కువ డిమాండ్ ఉన్న వస్తువులపై ఆఫర్లు పెద్దగా లేవని తెలిపారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈకామర్స్ సంస్థలు సైతం వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుండగా అక్టోబర్ 17 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here