Sai Pallavi: నేచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే.ఎంతో అద్భుతమైన కథలను ఎంపిక చేసుకొని, ఎలాంటి గ్లామరస్ పాత్రలకు చోటివ్వకుండా సెలెక్టివ్ పాత్రలను ఎంపిక చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి ఉన్నఫలంగా కూలీగా మారిపోయారు.

అయితే ఈమె ఏదైనా సినిమా కోసం ఇలా కూలిగా మారారు అనుకుంటే పొరపాటు పడినట్లే.సినిమా కోసం కాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా పొలం పనులలో పాల్గొన్నారు.ఉగాది పండుగ సందర్భంగా సెలబ్రిటీలు అందరూ కలిసి ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటుంటే సాయిపల్లవి మాత్రం మహిళా కూలీలతో కలిసి పొలం పనులు చేస్తూ పండుగను జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే పొలంలో మహిళలు వ్యవసాయ పనులు చేస్తూ పంటను కోస్తుండగా సాయి పల్లవి కూడా వారి తరహాలోనే పొలం పనులలో పాల్గొని వారితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ విధంగా పొలం పనులు చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి.
స్టార్ హీరోయిన్ అనే గర్వం లేకుండా…
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పెద్దఎత్తున సాయి పల్లవి పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా సాధారణ కూలీలతో కలిసి స్టార్ హీరోయిన్ అనే గర్వం లేకుండా, సాధారణ వ్యక్తిగా అందరితో కలిసి పోవడంతో ఈమె సింప్లిసిటీ కి ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నీకన్నా అందంగా ఎవరు ఉండలేరు అంటూ ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి నటించిన విరాటపర్వం విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ప్రస్తుతం ఈమె ఎలాంటి సినిమా షూటింగ్స్ లో పాల్గొనకుండా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

































