కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కంటే ముందు నుంచి నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీకి సంబంధించి పాటలు హల్ చల్ చేశాయి. లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే నేడు లవ్ స్టోరీకి సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. సమంత, నాగ చైతన్యకు సంబంధించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వాళ్లిద్దరు విడిపోయారని.. విడాకులు కూడా తీసుకుంటున్నారంటూ కోడై కూస్తున్నాయి.

అయితే సమంత వాటికి అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టినట్టే కనిపించింది. ఎలా అంటే.. నాగ చైతన్య ట్విట్టర్ లో లవ్ స్టోరీ ట్రైలర్ పోస్ట్ చేయగా.. దానిని కోట్ చేస్తూ సమంత స్పందించారు. ఇక ట్రైలర్ పై ఆమె ‘విన్నర్’ అని కామెంట్ పెట్టింది. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపింది. ఆ కామెంట్ చూసి నెటిజన్లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
WINNER!!
— S (@Samanthaprabhu2) September 13, 2021
All the very best to the team @Sai_Pallavi92 ????.. #LoveStoryTrailer https://t.co/nt9rzTc3lY
ఎట్టకేలకు అభిమానుల అనుమానాలకు ఒక్క ట్వీట్ తో తెరపడినట్లు అయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆ ట్వీట్ కేవలం లవ్ స్టోరీ సినీ బృందానికి, సాయి పల్లవికి మాత్రమే చెప్పినట్లు ట్యాగ్ చేశారు. ఇది మళ్లీ మరో వివాదానికి దారి తీస్తుందా..? ఇదిలా ఉండగా.. సమంత, నాగచైతన్యది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. ఏమాయ చేశావే సినిమాతో ఇద్దరు ప్రేమలో పడి.. పెళ్లి దాకా తెచ్చకున్నారు.































