మీరు కొత్త ఫోన్‌ను కొనాలని అనుకుంటున్నారా ? లేదా ఫ్లాగ్‌షిప్‌కి అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నట్లయితే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 లో కొనడానికి మీకు ఇదే మంచి అవకాశం అవ్వొచ్చు.రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో స్మార్ట్ఫోన్లు మరియు ఇతర గాడ్జెట్‌ల పై భారీ డిస్కౌంట్ సేల్‌ను తీసుకురానుంది.

దీనిలో పోకో, మోటరోలా, ఆసుస్, శామ్‌సంగ్ మరియు ఇతర అగ్ర బ్రాండ్లు తమ అత్యధికంగా అమ్ముడైన పరికరాలపై భారీ ధర తగ్గింపు ఆఫర్ ను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 7న బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అయితే దీనిలో ఇన్ఫీనిక్స్ బ్రాండ్‌కు చెందిన ఏడు స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.8,999 కాగా, ఆఫర్ ధర రూ.7,999. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5ఏ స్మార్ట్‌ఫోన్ రూ.6,499 కు రానుంది. దీనిపై డిస్కౌంట్ రూ.500 లభిస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 స్మార్ట్‌ఫోన్ర రూ.6,999లకు.. ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇన్‌ఫినిక్స్ హాట్ 10S వంటి అగ్ర పరికరాలను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 12,999, కానీ మీరు దానిని కేవలం రూ. 9,499. కి పొందవచ్చు.
ఇన్ఫినిక్స్ హాట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర రూ.9,999 గా ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 11 స్మార్ట్‌ఫోన్ రూ.8,999 గా లభించనుంది. ఇన్ఫినిక్స్ నోట్ హాట్ 10 స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర రూ.11,999కు లభించనుంది. అంతేకాకుండా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులకు సంబంధించి కార్డులతో అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.































